telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

డేటింగ్ యాప్ లో పరిచయమైన అతడు… కారులో వెళ్తుండగా…!?

Florida

అమెరికాలో ఓ యువతికి జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎదురైంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తితో కారులో వెళ్తుండగా… ఆ కారును పోలీసులు చేజ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో యువతికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చివరకు పోలీసులు అతడిని చేజ్ చేసి స్టాప్ స్టిక్స్ (కారును ఆపడానికి టైర్ల కింద వేసేవి) ద్వారా కారును ఆపారు. అయితే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్పటికే పక్కనున్న చెట్లలోకి పారిపోవడంతో కారులో యువతి మాత్రమే పోలీసులకు కనిపించింది. అతడి గురించి ఆరా తీయగా… కొద్ది గంటల క్రితమే అతడితో తనకు పరిచయం అని పేర్కొంది. హోటల్‌లో భోజనం చేసి కారులో వెళ్తుండగా… ఇలా జరిగినట్టు వివరించింది. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన నేరమేంటని యువతి పోలీసులను అడగగా… టోల్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడని, ఓవర్ స్పీడ్ వెళ్లాడని పోలీసులు తెలిపారు. చివరకు ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకోగా.. తన డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారని… ఆ విషయం మీద పట్టుకుంటున్నారనే భయంతో తప్పించుకున్నానని వివరించాడు. తాము కేవలం టోల్ ఉల్లంఘనకు పాల్పడినందుకే చేజ్ చేశామని, తమకు తెలీకుండా ఆ వ్యక్తి చాలా తప్పులు చేసినట్టు పోలీసులకు అర్థమైంది. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పాత నేరాల గురించి ప్రశ్నిస్తున్నారు.

Related posts