telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

యువతిని కిడ్నాప్ చేసి.. తాళి కట్టిన యువకుడు!

New couples attack SR Nagar

తనతో వివాహానికి యువతి నిరాకరించిందన్న కోపంతో యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిని కిడ్నాప్ చేసి తాళి కట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోకి హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు (23) బస్‌స్టాప్‌లో ఎదురుచూస్తున్న సమయంలో కొందరు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించారు. అనంతరం యువతికి బావ వరుస అయ్యే మను (30) అనే యువకుడు ఆమె మెడలో తాళి కట్టాడు.

తనను వదిలేయాలని ఆమె బతిమాలినప్పటికీ అతడు వినిపించుకోకుండా కారులోనే ఆమె మెడలో తాళి కట్టి, అనంతరం తన స్నేహితుడి వద్ద ఆమెను దాచిపెట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వారి చెర నుంచి కాపాడారు.పెళ్లి చేసుకోవాలంటూ మను ఏడాదిగా ఆమె వెంట పడుతున్నాడు. అయితే, ఆమె మాత్రం తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించాడు. మంగళవారం రాత్రి బాధితురాలు హసన్ డెయిరీ సర్కిల్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. వినయ్, ప్రవీణ్‌, మరో స్నేహితుడితో కలిసి కారులో అక్కడికి చేరుకున్న మను బాధితురాలిని కిడ్నాప్ చేసినట్టు హసన్ ఎస్పీ రామ్ నివాస్ సేపట్ తెలిపారు.

Related posts