ప్రస్తుత తరుణంలో ఆఫర్లు, గిఫ్టులు ప్రకటనలను చూసి వినియోగదారులు వెంటనే స్పందించి ఆయా షాపుల వద్దకు పరుగెడుతారు. కొన్ని సందర్భాల్లో మోసపోయి డబ్బులు పొగుట్టుకొంటారు. ఈ క్రమంలో హైద్రాబాద్ నగరంలో గిఫ్టుల పేరుతో దోచుకుంటున్న ఏడుగురిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. జియాగూడకు చెందిన సారిక 10 రోజుల క్రితం అత్తాపూర్‌లోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఆమె చేతిలో గిఫ్ట్ ఓచర్ పెట్డాడు.
ఇటీవల ఫోన్ చేసి మీ గిఫ్ట్ ఓచర్‌కు బహుమతులు వ చ్చాయి.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో ఉన్న డెస్టినీ ఇన్ఫో సర్వీసెస్ కా ర్యాలయానికి రావాలని కోరారు. దీంతో సారిక అక్కడికి వెళ్లగా.. పలు గిఫ్టులు చేతిలో పెట్టి విదేశీ టూర్లు, విలువైన ప్లాట్లు ఇస్తామంటూ చెప్పగా రూ.30వేలు చెల్లించింది. అయితే తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, అనుమానంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోని దిగిన సీఐ నిరంజన్ రెడ్డి బృందం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
నాలుగు నెలల్లోనే అమరావతిని ముంచేశారు: చంద్రబాబు