telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ ఆకర్ష్ పధకంలో .. దగ్గుబాటి వెంకటేశ్వరరావు .. !

Daggubati ysrcp candidate from parchur

భారీ ఆధిక్యంతో గెలిచినప్పటికీ బీజేపీ ఆకర్ష్ పధకం కొనసాగిస్తుండటం అన్నిపార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అంతే భారీగా గెలిచిన జగన్ పరిస్థితి కూడా కాస్తోకూస్తో అలాగే ఉందని చెప్పాల్సివస్తుంది. వైసీపీ కూడా పార్టీలోకి ఎవరైనా రావచ్చని, అయితే రాజీనామాలు చేసిరావాలని సూచనప్రాయంగా ఆహ్వానం పలికింది. దానికి స్పందించిన గత జుంపింగ్ బ్యాచ్ లో కొందరు అంటే రామచంద్రబాబు లాంటివారు మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కూడా. అయితే వెన్నుపోటు పొడిచిన వారికి మళ్ళీ పార్టీలో చోటు ఇవ్వడంతో అంతర్గత కలహాలు మొదలై, జగన్ కు తలనొప్పిలా మారాయి. ఒకవైపు బీజేపీ వ్యూహం మరోవైపు సొంతపార్టీలో మల్లగుల్లాలు .. ఈ రెంటిమధ్య కొత్త సీఎం నలిగిపోతున్నాడు.

ఇదే సందు అనుకోని అసమ్మతి బ్యాచ్ కూడా జగన్ కి పార్టీ మారిపోతామంటూ హెచ్చరిస్తుండటం కొసమెరుపు. గత ఎన్నికలతో వైసీపీలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కు బీజేపీ ఆహ్వానం ఉందంటూ .. ఇదే సందర్భంలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నేను జగన్ తోనే ఉంటానని ఆయన చెప్పుకోవాల్సినంతగా ఈ వార్తలు విస్తరించాయి అంటే బీజేపీ వ్యూహం స్ఫష్టంగా కనిపిస్తూనే ఉంది. పార్టీకూడా తమ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవంటూ వివరణలు కూడా ఇచ్చుకోవడం ఇక్కడ మరో విశేషం. మరి బీజేపీ ఆకర్ష్ పనిచేస్తుందా.. జగన్ పార్టీ అధికారంలో కి వచ్చి కొన్నాళ్లే కదా అనుకుంటూ.. అసమ్మతి మరికొంతకాలం వేచిచూస్తుందా.. అనేది తేలాల్సి ఉంది. ఇక దగ్గుబాటి అంటే పర్చూరు నియోజక వర్గం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమిలేదు. దానికి పోటీగా ఎప్పటి నుండో పార్టీలో ఉంటున్న భారత్ కుమార్ కూడా ఈ చర్చకు కారణం అయ్యాడు. ఈ ఇద్దరికీ కాకుండా రామచంద్రబాబు మధ్యలోకి వస్తున్నాడా.. ఈ రచ్చ అంతా ఆ స్థానం కోసమేనా.. అంటే ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు.. ఏ నాయకుడి మనసులో ఏముందో.. తెరపైకి వస్తేగాని చెప్పలేని పరిస్థితి.

Related posts