ఐపీఎల్ 2021లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌లకు గాను రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షా మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 72 పరుగులు చేసిన షా.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే తాజాగా పృథ్వీ షా మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత జట్టులో చోటు దక్కపోవడం చాలా బాధించింది. ఆ సిరీస్‌లో తొలి టెస్టు తర్వాత నాకు జట్టులో చోటు దక్కలేదు. నా టెక్నిక్ గురించి విపరీతమైన కలత చెందా. నేను పదే పదే బౌల్డ్ అవుతున్నానంటే.. నా బ్యాటింగ్ టెక్నిక్‌లో ఏదో సమస్య ఉందని గ్రహించా. అది చిన్న సమస్య అయినా దాన్ని అధిగమించాలనుకున్నా. దానిపైనే ప్రధానంగా దృష్టి సారించి అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా’ అని తెలిపాడు. ‘బౌలర్లు బంతులు వేసే ముందు వాటిని అంచనా వేయడంపై ఫోకస్ చేశా. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వెంటనే నా కోచ్ ప్రశాంత్ షెట్టి సర్, ప్రవీణ్ ఆమ్రే సర్‌ల పర్యవేక్షణలో దాన్ని సరిచేసుకున్నా అని తెలిపాడు.
previous post
next post
ఆయుష్మాన్ భారత్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు…