telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సంక్రాంతి రేసు నుండి వకీల్ సాబ్ తప్పుకున్నాడా..?

Pspk

రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సీన్ సినిమా కోసం పవన్ అభిమానుల్లో ఎంతో ఎదురుచూస్తున్నారు. పింక్ సినిమాకు తెలుగు రీమేక్ వెర్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే వకీల్ సాబ్ విడుదల కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం టీజర్ అయిన ఇస్తారేమోనని పండగలకు ఎదురుచూశారు. ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి వకీల్ సాబ్ రేసు నుంచి తప్పుకొనేలా కనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ విడుదల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సంక్రాంతి సమయంలో కాకుండా మార్చి నెలలో వకీల్ సాబ్ మూవీని విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల టాక్. కరోనా కారణంగా టాలీవుడ్ సినిమాల షెడ్యూలు అంతా అతలాకుతలం అయిపోయింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, మెగాస్టార్ ఆచార్య, బన్నీ పుష్ప , త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఇవన్నీ ఎప్పటికి థియేటర్లలోకి వస్తాయి అన్నది సస్పెన్స్ గా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts