బీజేపీ యేతర రాష్ట్రాలపై ఆ పార్టీ తెరవెనుక చాపకింద నీటిలాగా.. సీక్రెట్ గా పనులు చేసుకుంటూ పోతున్నది. ఇప్పటికే సీక్రెట్ మిషన్ ను అనేక రాష్ట్రాల్లో అమలు చేసి సక్సెస్ అయ్యింది. అదే విధానాన్ని ఏపి లో కూడా అమలు చేసేందుకు సిద్ధం అయ్యింది. సీక్రెట్ గా పావులు కదుపుతూ.. వివిధ పార్టీల్లోని బడాబడా నాయకులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. త్వరలోనే మరికొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు పార్టీలో చేరబోతున్నారు. వీరితో పాటు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారట.
ఆ పార్టీ ఆకర్ష్ పథకానికి ఎవరెవరు పార్టీ మారబోతున్నారు అన్నది ఇంకా బయటకు రావడంలేదు. పార్టీ మారాలని అనుకుంటున్న నేతలు అటు పార్లమెంట్ లోను, ఇటు అసెంబ్లీలోను టిడిపితో అంటి అంటనట్టుగా ఉంటున్నారు. ఆయా నేతలు ఇప్పటికే బీజేపీ నాయకులతో టచ్ లో ఉంది చర్చలు జరుపుతున్నారట. సో, ఒక సమయం చూసుకొని పార్టీ మారతారని. ఒక్కొక్కరుగా కాకుండా పార్టీ మారే ఆలోచనలు ఉన్న అందరు ఒకేసారి పార్టీ మారతారని, వారికి ఓ బడానేత మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఆ నేత ఎవరు, ఎవరెవరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అన్నది మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.