telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇళ్ల మధ్యలోనే మద్యం దుకాణాలు.. నారా లోకేశ్ విమర్శలు

Minister Lokesh comments YS Jagan

మద్యం విక్రయాల పై ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని మహిళలు వేడుకొంటున్నా పట్టించుకోవడం లేదంటూ ఏపీ సీఎం జగన్ పై ఓ వీడియోను పోస్ట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దని ఆందోళనకు దిగినందుకు మహిళలనీ కూడా చూడకుండా వారిని రోడ్డుపైకి ఈడ్చి కొట్టిస్తారా? అని ప్రశ్నించారు.

మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమ్మల్ని మహిళలు నిషేధించడం ఖాయం జగన్ గారూ! అంటూ విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే సారా దుకాణాలు తెరుస్తున్నారని విమర్శించారు. తమ ఇళ్లల్లో పిల్లలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు ఉన్నారని మహిళలు చెబుతున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Related posts