telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి రైతులకు బేడీలు : డీజీపీకి వర్ల రామయ్య లేఖ

varlaramaiah tdp

అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుబడుతూ రాష్ట్ర డీజీపీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. సుప్రీమ్ కోర్టు అదేశాలు ధిక్కరిస్తూ రైతులకు బేడీలు వేయడం క్షమించరాని నేరమని డీజీపీకి తెలిపిన వర్ల…ముద్దాయిలైన రైతులు అందరికి తెలిసినవారే, పారిపోయే వాళ్లు కాదు, మరి బేడీలు ఎందుకు వేశారు? అని ప్రశ్నించారు. ఎవరి అదేశాల మేరకు అమరావతి కోసం అదోళన చేస్తున్న రైతులకు బేడీలు వేశారు? అని
అమరావతి ఉద్యమాన్ని అణచడం కోసం.. రైతులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం బేడీలు వేశారా? నిలదీశారు. ఎస్కార్డు సిబ్బందిని, రైతులకు బేడీలు వేయమని అదేశించిన ‘‘అజ్ఞాత వ్యక్తి’’ ఎవరు? అని..ఈ కేసు విచారణ అంతా తప్పుల తడకగా సాగిందన్నారు. ఈ కేసు విచారణ అధికారి గత చరిత్ర దృష్ట్యా, మరో అధికారితో ఈ కేసు పునర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  ఫిర్యాదు రవి కేసు వాపస్ తీసుకుంటానంటే, విచారణ అధికారి అతనిని ఎందుకు బెదిరించారు? అని.. రాష్ట్ర డీజీపీగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని పోలీసు గౌరవాన్ని కాపాడండని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.

Related posts