ఏపీ సీఎం జగన్ హామీలు చేతల్లో చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ పేపర్ మీద బాగున్నా..అమల్లో కనిపించదని విమర్శించారు. టీడీపీ నేత చంద్రబాబు తరహాలోనే జగన్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు.
వైఎస్ ప్రజల మనిషి, ఆయనతో ఎవరినీ పోల్చలేమన్నారు. రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే లు, మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనివెల్లడించారు. ఆదివారం రాజేష్‌సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని తెలిపారు. ఎవరెవరు చేరుతున్నారో మీరే చూస్తారని, ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని ఎద్దేవాచేశారు.
60 ఏళ్ల మన కష్టాన్ని తెలంగాణ దోచుకుంది: చంద్రబాబు