టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం తిరుమలలో ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఎన్నిరోజులు తెరిచి ఉంచాలనే అంశంపై అత్యవసర సమావేశంలో ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఉచిత లడ్డూ ప్రసాదంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మండలిలో చాలా మంది సభ్యులు పదిరోజులు వైకుంఠ ద్వార దర్శనానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశిని పదిరోజులు పెంచేందుకు మీ అభిప్రాయం చెప్పాలని టీటీడీకి హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే.