telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ధరణి రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష…

Kcr telangana cm

భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. నిన్న రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూములను రైతులు  సులభంగా  రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు  సీఎం. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా సులభంగా జరిగే విధానమే రావాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ల వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నాన్‌-అగ్రికల్చర్‌ ఆప్షన్‌ ఓపెన్‌ కావడం లేదు. చాలాకాలం తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందుబాటులోకి రావడంతో స్లాట్ల బుకింగ్‌ పెరిగింది. ఆస్తుల క్రయవిక్రయదారులు స్లాట్ల కోసం పోటీపడుతుండటంతో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.

Related posts