telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ దే విజయం అని తేల్చిన ఆసీస్ కెప్టెన్…

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్‌ పైన్‌. ఆస్ట్రేలియా గతేడాది తన సొంత గడ్డపై భారత్‌, న్యూజిలాండ్‌ జట్లతో టెస్టు సిరీస్‌లో తలపడిన సంగతి తెలిసిందే. కివీస్‌పై గెలుపొందిన ఆసీస్.. టీమిండియాపై 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలోనే భారత్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే.. కచ్చితంగా గెలుస్తుందని పైన్‌ చెప్పుకొచ్చాడు. బ్రిస్బేన్‌లో తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్‌ పైన్ మాట్లాడుతూ… ‘నా అంచనా ప్రకారం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందరూ బాగా ఆడితే చాలు. ఇక కివీస్ కూడా పటిష్టంగానే ఉంది. ఇంగ్లండ్ జట్టును దాని సొంతగడ్డపై ఓడించింది. ఇంగ్లీష్ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్స్ తుది జట్టులో ఆడలేదు’ అని అన్నాడు. డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Related posts