telugu navyamedia
రాజకీయ వార్తలు

“చంద్రయాన్-2” క్షణాలను వీక్షించి తనతో షేర్ చేసుకొండి: మోదీ ట్వీట్

narendra-modi

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘చంద్రయాన్-2’ ల్యాండర్ ‘విక్రమ్’ జాబిల్లిపై మరి కొద్ది గంటల్లోనే కాలుమోపనుంది. ఈ ఉద్విగ్వ క్షణాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రయాన్ ప్రత్యేక క్షణాలను వీక్షించి, అందుకు సంబంధించిన ఫోటోలు, అనుభూతులను తనతో షేర్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు వరుస ట్వీట్లలో దేశ ప్రజలను కోరారు.

శనివారం తెల్లవారుజామున 1.55 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ను జాబిల్లిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత…సుమారు 5.30 నుంచి 6.30 మధ్య అందులోంచి ప్రజ్ఞాన్ రోవర్ వెలుపలికి వస్తుంది. అయితే విక్రమ్ చంద్రుడిపై నెమ్మదిగా దిగడానికి పావుగంట పడుతుంది. ఇది అత్యంత క్లిష్టమైన ల్యాండిగ్ కావడంతో దీనిని ’15 మినిట్స్ ఆఫ్ టెర్రర్’గా వ్యవహరిస్తారు. శాస్త్రజ్ఞుల కృషి ఫలించి, అంతా సజావుగా జరిగేతే విక్రమ్ మృదువుగా చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇంతవరకూ అలా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనతను దగ్గించుకున్న అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ కూడా చేరనుంది.

Related posts