telugu navyamedia
క్రీడలు వార్తలు

భార్యాభర్తల ఇంటర్య్వూ విడుదల చేసిన ఐసీసీ…

భారత పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మోడల్ సంజనా గణేశన్‌ను అతడు ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లి తర్వాత జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌లు తమతమ పనుల్లో బిజీ అయ్యారు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ప్రస్తుతం ఇద్దరూ లండన్‌లో ఉన్నారు. చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు సమాయత్తమవుతున్న బుమ్రాను తన భార్య సంజనా గణేషన్‌ ఇంటర్య్వూ చేసిన వీడియోను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో తన చిన్ననాటి విషయాలతో పాటు పెళ్లి తర్వాత తన జీవితంలో జరిగిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు చెల్లితో క్రికెట్‌ ఆడడం.. ఆ తర్వాత స్కూల్‌ దశలో ఆడిన రోజులను ఎప్పటికి మరిచిపోను. పెళ్లి తర్వాత మరో కొత్త జీవితం మొదలైందని బుమ్రా చెప్పాడు. అంతకుముందు ఇంట‌ర్వ్యూకి వ‌స్తున్న స‌మ‌యంలో అక్క‌డ రెడీగా ఉన్న సంజనా గణేశన్‌ను చూసిన జస్ప్రీత్ బుమ్రా.. ఇంత‌కుముందు నిన్నెక్క‌డో చూశానే అని అంటాడు. దానికి ఆమె నేను ఎప్పుడూ ఇక్క‌డే ఉంటాను అని సరదాగా చెప్పింది. ఇంట‌ర్వ్యూలో ఎలా మాట్లాడాలి, త‌న‌ను తాను ఎలా ప‌రిచ‌యం చేసుకోవాలో కూడా బుమ్రాకు సంజనానే వివ‌రిస్తుంది

Related posts