telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పెళ్లి పేరుతో యువతిని 10 లక్షలకు మోసం…

marriage

పెళ్లి పేరుతో ఓ యువతిని 10 లక్షల 50 వేలు రూపాయలు మోసం చేశాడు ఓ ఘరానా మోసగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. తెలుగు మ్యాట్రిమోనీలో హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనీ లో అప్డేట్ చేసింది. అయితే మునగర్స్ మేహుల్ కుమార్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పని చేస్తున్నాను అని ఆ యువతిని మోసం చేశాడు. ప్రొఫైల్ నచ్చిందని, వివాహం చేసుకోవడానికి అంగీకారమే అని చెప్పి ఆ యువతితో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఒక దశలో వీసా పంపిస్తానని 50 వేల రూపాయలు ఖర్చు అవుతాయని ఆ కేటుగాడు చెప్పగా.. 50 వేల రూపాయలు డిపాజిట్ చేసింది ఆ యువతి. ఇంకొక దఫాలో గుజరాత్ లో ఇల్లు కొన్నానని, దాని రేనివేషన్ కు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని నిందితుడు ఆ యువతికి మోస మాటలు చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆ యువతి.. 10 లక్షల రూపాయలు కూడా అతని అక్కౌంట్లో వేసింది. అయితే పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఆ నిందితుడు..ఆమెను దూరం పెట్టాడు. దీంతో తాను మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. ఆమె ఫిర్యాదుతో.. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts