telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం ఒత్తిడి వల్లే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్

ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీయే బెటర్‌ అని తెలంగాణ హెల్త్‌ మినిష్టర్‌ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ తోనే 80 లక్షల కుటుంబాలకు లబ్ది.. కేంద్రం ఒత్తిడి కారణంగానే ఆయుష్మాన్ భారత్ అమలు చేయబోతున్నామన్నారు. ఆయుష్మాన్ భారత్ తో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ది పొందుతారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం కాదని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించాలన్నారు. కాళేశ్వరంకు జాతీయ హోదాతో పాటు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని… కానీ ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ అమలుకు విధివిధానాలు త్వరలో ఖరారు చేస్తామని… మెడికల్ సీట్లలో ఎవరికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు. మీడియాలో వచ్చిన వార్తలు మా దృష్టికి వచ్చాయని… నిపుణుల కమిటీ వేశామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 80 శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉండగా.. 15 శాతం ఒపెన్ క్యాటగిరి ఉండేదని తెలిపారు. అందులో జరిగిన తప్పిదాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని… కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా.. పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కరోనా స్ట్రెయిన్ కేసులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో యూకే నుంచి ఒకరికి మాత్రమే కొత్త స్ట్రెయిన్ సోకింది.. వారి నుంచి ఇతరులకు కొత్త వైరస్ రాలేదని..తెలంగాణ ప్రజలు అందోళన చెందవద్దని సూచించారు.

 

Related posts