telugu navyamedia
క్రీడలు వార్తలు

కెప్టెన్సీ నుంచి తప్పించడంతో వార్నర్ షాక్‌ అయ్యాడు : టీమ్ డైరెక్టర్

సన్​రైజర్స్ హైదరాబాద్​ మాజీ సారథి డేవిడ్ వార్నర్ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అడే అవకాశం లేదని ఆ జట్టు కోచ్ ట్రెవర్ బెయిలీస్ అన్నాడు. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్​ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే వార్నర్​ను పక్కన పెట్టినట్లు ట్రెవర్ వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం తప్పలేదన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్​ల్లోనూ దాదాపుగా ఇదే వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో వార్నర్ షాక్‌కు గురయ్యాడని టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ అన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నాడు. ఇది అందరం కలిసి సమష్టిగా తీసుకున్న కఠిన నిర్ణయమని, ఇందులో ఏ ఒక్కరి పాత్ర లేదని స్పష్టం చేశాడు. ‘నిర్ణయం కఠినమైనదే అయినా అమలు చేయలేక తప్పలేదు. ఎందుకంటే మేం రేస్‌లో చాలా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. ఇలాంటి నిర్ణయాల వల్ల కొందరికి ఇబ్బంది కలగొచ్చు. నిరాశ కూడా చెందొచ్చు. వార్నర్ అయితే షాక్‌కు గరయ్యాడు. కానీ తప్పలేదు. గతంలో వార్నర్ బాగా ఆడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫామ్‌లేమితో పాటు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.’అని మూడీ చెప్పుకొచ్చాడు.

Related posts