telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ రాజీనామా…

vijayan kerala cm

మ‌రోసారి తిరుగులేని విజయాన్ని అందించారు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌.. కేర‌ళ‌లో కొన‌సాగుతోన్నసాంప్ర‌దాయాన్ని బ్రేక్ చేశారు.. రెండోసారి అధికారాన్ని చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.. ఇక‌, కొత్త కేబినెట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసే విధంగా.. ఇవాళ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు.. మధ్యాహ్నం రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌‌‌ను క‌లిసిన విజయన్.. తన రాజీనామా లేఖను అంద‌జేశారు.. అయితే, కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరే వరకు ముఖ్యమంత్రిగా విజయన్‌ కొనసాగాలని గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది.. కాగా, ఆదివారం వెలువ‌డిన కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజ‌య‌న్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది.. 4 దశాబ్దాలుగా కమ్యుూనిస్టులు (ఎల్డీఎఫ్‌), కాంగ్రెస్ కూటముల (యూడీఎఫ్‌) మధ్య ఒకరి తర్వాత ఒకరికి అధికారం కట్టబెట్టిన కేరళ ఓటర్లు.. ఈ సారి ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. రెండోసారి విజ‌య‌న్‌కు అండ‌గా నిలిచారు.. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేర‌ళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 99 చోట్ల విజయం సాధించ‌గా.. యూడీఎఫ్ 41 స్థానాలను గెలుచుకుంది.

Related posts