telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆది నుంచి అయోమయ ప్రకటనలే: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్ విజయశాంతి ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. కరోనా కేసులు తగ్గుతాయని ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మిన ప్రజలు, రెండు నెలలు ఇళ్లకే పరిమితం అయ్యారని, వారికి ఉపశమనం ఎప్పుడో అంతుబట్టడం లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు.

“టీఆర్ఎస్ సర్కారు సూచనలతో దాదాపు 2 నెలలుగా ఇళ్లకే పరిమితమైన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం ఎప్పుడో అంతుబట్టడం లేదు. మే 8వ తేదీ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుతాయన్న ప్రభుత్వ ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెంచుకున్నారు. కానీ కరోనా కట్టడి విషయంలో ఆది నుంచీ అయోమయ ప్రకటనలతో, అస్పష్ట నిర్ణయాలతో… టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఈ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది అని వ్యాఖ్యానించారు.

Related posts