telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆసుపత్రి నుంచి సోనియా డిశ్చార్జి

Soniya gandhi

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా గత గురువారం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న సోనియా ఇవాళ తన నివాసానికి వెళ్లారు.

సోనియా సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని గంగారామ్ ఆసుపత్రి డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఓ బులెటిన్ వెలువరించాయి.

Related posts