telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత..ఆస్పత్రిలో పరీక్షలు !

pawan

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్ ముందుజాగ్రత్తలో భాగంగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే తాజాగా పవన్ పరిస్థితి కాస్త అదుపు తప్పిందని సమాచారం. పవన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తేలింది. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న బండ్ల గణేష్, దిల్ రాజ్ కు కరోనా సోకింది.

Related posts