telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవన్ 150 కోట్ల కామెంట్స్… వర్మ కౌంటర్

Ram-Gopal-Varma

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో పవన్ చర్చలు జరుపుతున్నాడు. ఇటీవల మంగళగిరిలో జరిగిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తనను ఓడించడానికి, అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా ఉండటానికి 150 కోట్ల వరకు ఖర్చు చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. పవన్ చేసిన కామెంట్స్ జనాలను అవమానించేలా ఉన్నాయని, ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నా కూడా పవన్ ని నిజంగా గెలిపించాలని అనుకుంటే… అతనికే ఓటు వేసేవారని నిజంగా ఈ వ్యాఖ్యలు జనాల నిర్ణయాన్ని తప్పుబట్టేలా ఉన్నాయని వర్మ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇక సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనని, రాజకీయాల్లోనే కొనసాగుతానని పవన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Related posts