telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అగ్రరాజ్యంపై .. గుర్రుగా ఉన్న రష్యా..

russia and iran fire on america

అమెరికాపై ఒకపక్క ఇరాన్ గుర్రుగా అన్నవిషయం తెలిసిందే.. అయితే ఇరాన్ పై అనవసర ఆంక్షలను రష్యా కూడా కందిస్తూ, అమెరికా పై విమర్శలు చేస్తుంది. 2015 నాటి అణు ఒప్పందానికి కట్టుబడి వుండాలంటూ ఇరాన్‌పై వత్తిడి తెచ్చేందుకు అమెరికా కొనసాగిస్తున్న చర్యలపై ఇటు ఇరాన్‌తో పాటు అటు రష్యా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. తాజాగా జరిగిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) ప్రత్యేక సమావేశంలో అమెరికా ప్రతినిధి జాకీ వాల్కాట్‌ మాట్లాడుతూ ఇరాన్‌ ఇప్పుడు ‘అణు దోపిడీ’ని కొనసాగిస్తోందని ఆరోపించారు.

ఈ ఒప్పందంలో ఇతర భాగస్వామ్య దేశాలయిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలు నిర్లిప్తంగా వున్నంత వరకూ తాము ఈ ఒప్పందంలోని పరిమితులను పట్టించుకోబోమని ఇరాన్‌ తేల్చిచెప్పింది. ఇరాన్‌ ప్రతినిధి కాజెమ్‌ గరీబ్‌ అబదీ మాట్లాడుతూ అమెరికా వినతి మేరకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయటం విచారకరమని అన్నారు. అమెరికా కట్టుతప్పి వ్యవహరించటం వల్లే ప్రస్తుత ప్రతిష్టంభన ఏర్పడిందన్న ఆయన ఇరాన్‌పై ఆంక్షలు విధించిన అమెరికా ‘శాడిజా’న్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

వాస్తవానికి ఇరాన్‌ విషయంలో అమెరికా ఏకాకిగా మారిందని రష్యా రాయబారి మిఖాయిల్‌ ఉల్యనోవ్‌ సమావేశం అనంతరం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. అణు ఒప్పందం ‘భయంకరమైనద’న్న అమెరికా విజ్ఞప్తి మేరకు దానిపై చర్చించేందుకు ఐఎఇఎ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయటం విడ్డూరంగా వుందని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఒప్పందం అమలు ద్వారా లభించే ప్రయోజనాలుతెలిసే అమెరికా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు.

Related posts