telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారుతాయి : కవిత

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ తాజాగా మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జ‌గిత్యాల ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సమీకరణాలు మారుతాయంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఇంట్రెస్టింగ్ రాజకీయాలు జ‌రుగుతాయ‌న్న ఆమె.. ఏది జరిగినా అది టీఆర్ఎస్ పార్టీ మంచికే జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించారు.. మ‌రోవైపు రాష్ట్రంలో అనేక అంశాలు చర్చకు వ‌స్తాయ‌న్న ఆమె.. ఇంతకు మించి ఇప్పుడు ఏమీ మాట్లాడ‌ను అన్నారు. దీంతో.. తెలంగాణ‌లో పెద్ద ఎత్తున రాజ‌కీయ స‌మీర‌ణ‌లు మారుతాయ‌నే చ‌ర్చ మ‌ళ్లీ మొద‌లైంది.. అంటే మ‌రికొంద‌రు నేత‌లు… కారెక్కుతారా..? లేదా కొన్ని గుస‌గుస‌లు వినిపిస్తున్న‌ట్టు.. మ‌రికొంద‌రు నేత‌ల‌ను ఉద్వాస‌న త‌ప్ప‌దా? అనే చ‌ర్చ మొద‌లైంది. అయినా, రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే.. ఎమ్మెల్సీ క‌విత చెబుతున్న ఆ స‌మీక‌ర‌ణాలు ఏంటో చూడాలి మరి.

Related posts