telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తాను కునుకుతీశానని పేర్కొనడం సరికాదు: స్పీకర్ తమ్మినేని

ap speaker tammineni

శాసనసభలో లో ఈ రోజు నిద్రపోయినట్టు వచ్చిన ఆరోపణలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం బదులిచ్చారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏదో చీటీ వస్తే దాన్ని టేబుల్ కింద ఉంచి తల పక్కకు వాల్చి చదువుతుండగా కెమెరా లో నిద్రపోతున్నట్టుగా కనిపించిందని వెల్లడించారు. అంతేతప్ప, సభను పట్టించుకోకుండా తాను కునుకుతీశానని పేర్కొనడం సరికాదన్నారు.

తనకున్న రాజకీయ అనుభవంతో ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు మధ్య తేడా చెప్పారు. జగన్ ఒక్కసారి మాటిస్తే దానికే కట్టుబడి ఉంటాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కితగ్గడని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదని అన్నారు. తేలిగ్గా జారుకునే స్వభావం అని అభివర్ణించారు. స్పీకర్ అయినంత మాత్రాన రాజకీయ నేపథ్యం లేకుండా పోదని,నిర్భయంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తానని అన్నారు.

Related posts