telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యయత్నం..

ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి పేర్ని నానిపై హత్యా యత్నం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీతో మంత్రిపై దాడికి దిగారు. కాళ్లకు దండం పెట్టడానికి ఒంగోని మంత్రిపై దాడి చేసాడు నిందితుడు. ఈ ఘటనలో మంత్రి నానికి తృటిలో తప్పింది ప్రమాదం. మంత్రి నాని చొక్కా చినిగింది. దీంతో వెంటనే నిందితుడిని పట్టుకున్నారు మంత్రి పేర్ని నాని అనుచరులు. దాడి చేసిన వ్యక్తి తాపీమేస్త్రి అని తెలుస్తోంది. అంతే కాదు నిందితుడి పేరు బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. ఈ నిందితున్ని గట్టిగ మందలించారు మంత్రి అనుచరులు. మద్యం మత్తులో నిందితుడు ఈ దాడి చేశాడని తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పేర్ని నానిని మంత్రి కొడాలి పరామర్శించారు. ఈ ఘటన ఎలా జరిగిందని పేర్ని నానిని అడిగి తెలుసుకున్నారు కొడాలి నాని. అయితే… ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related posts