telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భార‌త్‌ను ఆదుకోవ‌డానికి ముందుకు వచ్చిన అమెజాన్…

amazon

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న భారత్ కు గూగుల్ సంస్థ భారీ సాయాన్ని ప్ర‌క‌టించ‌డ‌గా.. ఇప్పుడు అమెజాన్ ఇండియా కూడా ముందుకు వ‌చ్చింది. ఏసీటీ గ్రాంట్స్‌, టెమాసెక్ ఫౌండేష‌న్ పుణె ప్లాట్‌ఫామ్ ఫ‌ర్ కోవిడ్‌-19 రెస్పాన్స్‌లతో చేతులు క‌లిపి ఆ సంస్థ‌.. అత్య‌వ‌స‌రంగా సింగ‌పూర్ నుంచి 8 వేల ఆక్సిజ‌న్ కాన్సెన్‌ట్రేట‌ర్‌ల‌ను భార‌త్‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది… మ‌రో 500 బై-లెవెల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజ‌ర్ మెషీన్లు కూడా వీటితోపాటే వ‌స్తాయ‌ని.. ఈ సంస్థ‌ల‌న్నీ ఆ దిశగా భార‌త ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని.. వీలైనంత తొంద‌ర‌గానే వీటిని భార‌త్‌కు చేరుస్తామ‌ని వెల్ల‌డించింది.  ఇక‌, సింగ‌పూర్ నుంచి రానున్న ఆక్సిజ‌న్ కాన్సెట్రేట‌ర్స్ ఇత‌ర సామాగ్రిని దేశంలోని ఆయా క‌రోనా ఆస్ప‌త్రుల‌కు డొనేట్ చేస్తామ‌ని.. ఈ మెషీన్ల‌ను భార‌త్‌కు తీసుకురావ‌డానికి అయ్యే విమాన ఖ‌ర్చుల‌ను మొత్తం అమెజాన్ భ‌రిస్తుంద‌ని ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌.. అయితే, ఈ మెషీన్ల‌ను ఏసీటీ గ్రాంట్స్‌, పీపీసీఆర్‌, ఇత‌ర సంస్థ‌లు క‌లిసి కొనుగోలు చేయ‌గా.. అవి ఇండియాకు వ‌చ్చిన త‌ర్వాత వాటిని కోవిడ్ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించే బాధ్య‌త కూడా అమెజాన్ తీసుకుంటుంది..

Related posts