telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నైట్ డ్యూటీకి వెళ్ళి ఇంటికొచ్చిన యువకుడు… అది చూసి షాక్

Alligator

ఓ యువకుడు నైట్ డ్యూటీకి వెళ్లి ఉదయం ఆరు గంటలకు నిద్రమొహంతో ఇంటికి వచ్చాడు. తలుపు తీసి లోపలకు వెళ్లి నిద్రపోదామనుకుని అనుకుంటుండగా.. తలుపు ఎదురుగా భారీ ఆకారంలో ఉన్న పెద్ద మొసలి దర్శనమిచ్చింది. అంతే దెబ్బకు నిద్ర కూడా పోయింది. వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి సహాయం కోరాడు. సోదరుడి ద్వారా మొసలిని పట్టే వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి మొసలిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఫొటోను ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను అమెజాన్ ఫుల్‌ఫిల్‌‌మెంట్ సెంటర్‌లో నైట్ డ్యూటీ చేస్తానని, ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇలా జరిగిందని పోస్ట్ చేశాడు. ‘నీతో పాటు ఇంటి లోపలకు వెళ్లడం కోసం ఇంటి బయటే వేచి చూస్తోంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.

Related posts