telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి ఈటల ప్రసంగంపై అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శలు

Akbaruddin mim

క‌రోనా వ్యాపించ‌కుండా ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని తెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. క‌రోనా వైర‌స్‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌ను మంత్రి ఈట‌ల ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క‌రోనా వ్యాపించ‌కుండా మార్చి 14న పాక్షిక లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించామ‌న్నారు. ఇండోనేషియా నుంచి క‌రీంన‌గ‌ర్ వ‌చ్చిన వారిని వెంట‌నే ఐసోలేష‌న్ చేశామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రోజుకు 60 వేల క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి ఈటల ప్రసంగంపై ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఈటల ప్రసంగం కరోనా హెల్త్ బులెటిన్ లా ఉందని విమర్శించారు. కరోనాపై ప్రభుత్వ ప్రకటన అసమంజసంగా ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వారియర్స్ ను ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమని పేర్కొన్నారు. కొవిడ్ నిధికి విరాళాలు ఇచ్చిన వారిని గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు.

Related posts