telugu navyamedia
తెలంగాణ వార్తలు

రైతులకు 3 లక్షల ఎక్స్‌గ్రేషియాపై కేటీఆర్ ట్వీట్‌..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెన‌క్కి తీసుకున్న సంగ‌తి తెలిసిందే..అయితే రైతు సంఘాల పోరాటం వల్లే ప్రధాని మోదీ దిగి వచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని శ‌నివారం కేసీఆర్ మీడియాతో తెలిపారు.

అయితే  చట్టాలు రద్దు చేసినట్లుగానే.. రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశంలో అన్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలకు కేంద్రం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఎన్‌సీఆర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన 750 మందికి పైగా రైతులకు ₹3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకు గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గర్వంగా ఉందని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం కూడా ప్రతి రైతు కుటుంబానికి ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, అలాగే అన్ని కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related posts