telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మా పెద్ద‌మ్మ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు..

*రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణం
*మా పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదు
*క్రమశిక్షణకు మారుపేరు నందమూరి కుటుంబం
* మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదు.
*నారావారిపల్లెలో పూర్వీకుల సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన

ఆంధ్రప్రదేశ్​ శాసనసభలో శుక్రవారం నాడు సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించని చంద్రబాబు ఇలా ఆవేద‌న‌కు లోన‌వ‌డం కుటుంబ‌స‌భ్య‌లుతో పాటు తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చ‌లించిపోతున్నారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు సోదరుడి కుమారుడు , ప్ర‌ముఖ సినీ న‌టుడు నారా రోహిత్ త‌మ‌ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు.

Bhuvaneswari to Vote for TRS or TDP?

తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారు. అన్న ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు…గడప దాటలేదు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదు.

NTR Model School Annual Day: at TeluguPeople.com Photo Gallery

జీవితంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి నేతలు మనసు గాయపర్చినప్పటికీ భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తుపాను బాధితులకు సహాయ,సహకారాలు అందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే సహించేది లేదని నారా రోహిత్ హెచ్చరించారు.

Related posts