telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

క్షయ వ్యాధిపై అవగాహన లేక.. ఏటా 12 వేల మంది చనిపోతున్నారు!

Etala Rajender

మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నా ప్రజల్లో టీబీ పై అవగాహన లేదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో టీబీ(క్షయ వ్యాధి)పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి అశ్వినికుమార్‌ చౌబే, రాష్ట్ర హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఏటా రాష్ట్రంలో 12 వేల మంది టీబీతో చనిపోతున్నారని, మందులు, వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నప్పటికీ టీబీ పై ప్రజల్లో అవగాహన లేదన్నారు. 2025 నాటికి భారత్‌ నుంచి టీబీని తరిమికొట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో అంతకంటే ముందే టీబీని తరిమికొడుదామని అన్నారు.

Related posts