telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇంటిలిజెన్స్‌ అధికారుల బదిలీపై కోర్టులో సవాల్‌

Chandrababu comments Jagan cases

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఉన్నప్పుడు కడప ఎస్పీ వేటుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలతో సంబధంలేని ఇంటిలిజెన్స్‌ డీజీని బదిలీ చేసే అధికారం సీఈసీకి లేదని ప్రభుత్వం పేర్కొంది. అధికారుల బదిలీపై కోర్టులో సవాల్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే హైకోర్టులో లంచ్‌ మోషన్‌ను మూవ్‌ చేయాలని టెలికాన్ఫరెన్స్‌లో అధికారులకు సీఎం ఆదేశించారు.

నిఘా విభాగం బాస్‌ ఏబీ వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ రాత్రికి రాత్రి బదిలీ చేసింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆయా శాఖల్లో అసహనం వ్యక్తమవుతోంది.

Related posts