telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్‌ వైఖరి మునుపటిలా లేదు: రాజు రవితేజ

raju raviteja janasena

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై రాజు రవితేజ విమర్శలు గుప్పించారు. పవన్‌ కల్యాణ్‌ సన్నిహితుడు అయిన రవితేజ శుక్రవారం జనసేనకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా తో రాజు రవితేజ మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ సమాజాన్ని విచ్ఛిన్నపరిచే, విభజించే శక్తిలాగా మారుతున్నారని విమర్శించారు.

జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో చేశానని, మరెంతో చేద్దామనుకున్నానని రవితేజ వెల్లడించారు. కానీ, తన ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా పవన్‌ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ బాగు కోసం చేసిన ఆలోచనల్ని ఆయన ఒక్కసారి కూడా అమలు చేయలేదని వాపోయారు. పవన్‌ వైఖరి మునుపటిలా లేదని, అందుకే పార్టీని వీడినట్టు ఆయన వెల్లడించారు.

Related posts