telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అంబానీ, అదానీలకు వ్యవసాయాన్ని దారాదత్తం చేసేందుకే కొత్త చట్టాలు…

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నీ నిరసిస్తూ ఈనెల 29న రూరల్ కలెక్టరేట్ ముందు రైతులతో కలిసి ధర్నా చేయాలని వరంగల్ రూరల్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 న పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా రూరల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిదులందరం రైతులతో కలిసి ధర్నా చేయనున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. దేవాదుల మూడవ దశ పనులను కేంద్ర ప్రభుత్వం ఆపడం దుర్మార్గమని వెంటనే పనులను ప్రారంబించేందుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం పెట్టుబడి దారులైన అంబాని..అధానీలకు వ్యవసాయాన్ని దారాదత్తం చేసేందుకే చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము రైతులకు తోఢుగా పోరాటం చేస్తామన్నారు. దేవాదుల మూడవ దశ పనులను కేంద్రం ఆపడం సిగ్గుచేటన్నారు. రైతులకు అన్యాయం చేసేందుకే కాళేశ్వరం..దేవాదుల నీటిని వాడుకోకుండా అడ్డుపదుతున్నదన్నారు. రైతుల మనోదైర్యాన్ని దెబ్బ తీసేందుకే…నిరసనను చెదరగోట్టేందుకే….రైతులు చేస్తున్న నిరసనలో మావోయిస్టులు ఉన్నారని ఒక లీకులు…అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు….రైతు వ్యతిరేక విదానాలు మానుకోకుంటే రానున్న కోత్త సంవత్సరం యుద్ద…ఉద్యమ సంవత్సరం అవుతదని హెచ్చరించారు.

Related posts