telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. వెస్టిండీస్ పై కివీస్ విజయం.. అభిమానుల కన్నీటి కారణం..

newzeland won on westindies in world cup

ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్-కివీస్ తలపడ్డాయి. పోరాడటానికి ప్రయోగాలు చేస్తుంటాం.. అలాగే ప్రయత్నించి, అభిమానులతో కన్నీరు పెట్టించారు వెస్టిండీస్ ఆటగాళ్లు. వెస్టిండీస్‌ కథ ముగిసిందనుకున్న సమయంలో కార్లోస్‌ బ్రాత్‌ వైట్‌ అనూహ్యంగా పోరాడాడు. కివీస్‌ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ, తన జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. 7 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన సమయంలో, సిక్సర్‌ కోసం ప్రయత్నించి, అవుట్ కాగా, మైదానంలో ఉన్న వెస్టిండీస్ అభిమానుల గుండె బద్ధలైంది. ఎంతో మంది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చన్న స్థితిలో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా, న్యూజిలాండ్ కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్, (154 బంతుల్లో 14 ఫోన్లు, ఒక సిక్స్ తో 148 పరుగులు)తో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 291 పరుగులు చేసింది.

వెస్టిండీస్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన క్రిస్ గెయిల్ 84 బంతుల్లో 87 పరుగులు చేసి రాణించగా, హెట్‌ మెయర్‌ 45 బంతుల్లోనే 54 పరుగులు చేయడంతో విండీస్ గెలుపు దిశగానే అడుగులు వేసింది. భారీ షాట్లతో వీరిద్దరూ స్కోర్ బోర్డ్ ను ఉరకలెత్తించారు. హోప్, పూరన్ లను స్వల్ప వ్యవధిలోనే అవుట్ చేసిన బౌల్ట్, ఆపై చివరిలోనూ రాణించాడు. దీంతో విండీస్ గెలుపు అవకాశాలు క్లిష్టమయ్యాయి. ఆ సమయంలో వచ్చిన బ్రాత్‌ వైట్‌ అసాధారణంగా పోరాడాడు. 245 స్కోరు వద్ద 9వ వికెట్‌ పడిపోయినా తగ్గలేదు. 49వ ఓవర్ లో నీషమ్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి, బౌండరీ వద్ద బౌల్ట్‌ కే క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Related posts