ఇన్ స్టంట్ ఫైనాన్స్ యాప్స్ కాల్ సెంటర్ల కేసు దర్యాప్తు వేగవంతం చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. కాల్ సెంటర్ లో పనిచేసే 610 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసారు పోలీసులు. మొత్తం 30 ఇన్ స్టంట్ ఫైనాన్స్ యాప్స్ ను గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కస్టమర్లకు నగదు బదిలీ చేసిన ఇన్ స్టంట్ ఫైనాన్స్ యాప్స్ కు చెందిన 75 బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. ఇన్ స్టంట్ ఫైనాన్స్ యాప్స్ కు సంబంధించి నాలుగు బ్యాంక్ ఖాతాలల్లో 50 లక్షలు ఫ్రీజ్ చేసారు పోలీసులు.. ఈ ఖాతాల నుండి కస్టమర్లకు ఆన్లైన్ యాప్స్ నిర్వాహకులు నగదు బదిలీ చేసారు. అయితే.. ఈ కేసులో మధు బాబు కీలక వ్యక్తిగా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.. బెంగళూరులో తప్పుడు అడ్రస్ పెట్టి కంపెనీలను ఏర్పాటు చేసారు మధు బాబు. ప్రస్తుతం మధుబాబును పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. అతన్ని పట్టుకుంటే కీలక విషయాలు బయటపడనున్నాయి.
next post