క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బయటే కాదు సోషల్‌మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. విజయ్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్స్ సాధించుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 మిలియన్ల ఫాలోవర్స్‌ని కలిగిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. దక్షిణాది ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న తమ అభిమాన హీరోని చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. విజయ్ దేవరకొండ 2018, మార్చి 7న తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ప్రారంభించారు. ఇంత తక్కువ వ్యవధిలోనే 10 మిలియన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకోవడం అరుదైన విషయమే. ఇక రౌడీ బ్రాండ్‌తో కొంతకాలం క్రితం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. కాగా.. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్, కరణ్ జోహార్‌తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ మారిందని టాక్. ఈ చిత్రానికి తొలుత ‘ఫైటర్’ టైటిల్ ఖాయం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post