telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ఘనంగా జరిగిన మెహ్రీన్ నిశ్చితార్థం…

హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు అయిన భవ్య బిష్ణోయ్‌తో పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే త్వరలోనే వివాహం చేసుకోబోతున్న ఈ జంట జైపూర్ లో తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు . కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడే భవ్య బిష్ణోయ్‌. కాగా, ఇరుకుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో మెహ్రీన్‌, భవ్య ఆ మధ్య తమ వివాహం గురించి ప్రకటించారు. అయితే ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’,‘ఎఫ్2’, ‘కవచం’ సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఎఫ్‌ 3’ సినిమాలో నటిస్తోంది. అయితే మెహ్రీన్ సోదరుడు గుర్ ఫతేసింగ్ ఈ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే పెళ్లి తరువాత మెహ్రీన్ సినిమాల వైపు చూస్తారో లేదో చూడాలి.

Related posts