telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మోడీ వ్యాక్సిన్ తీసుకునేది అప్పుడే..

Modi Mask

చైనా నుండి వచ్చి మన దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ప్ర‌క్రియ నిన్న మొద‌లైంది. తొలిరోజున 1.91 ల‌క్ష‌ల‌మందికి క‌రోనా టీకాను అందించారు.  తొలివిడ‌త‌లో ఆరోగ్య‌సిబ్బందికి మాత్ర‌మే వ్యాక్సిన్‌ను అందిస్తున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ పెర్కొన్న సంగ‌తి తెలిసిందే.  ఆరోగ్య‌సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చిన త‌రువాత‌, క‌రోనా ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ కు టీకా అందిస్తారు.  ఆ త‌రువాత‌, 50 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వ్య‌క్తుల‌కు టీకా అందించ‌బోతున్నారు.  అయితే, రాజ‌కీయ నాయ‌కులు వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  ఈ విమ‌ర్శ‌ల‌కు కేంద్రం చెక్ పెట్టేందుకు మంత్రులు రంగంలోకి దిగారు.  రెండో విడ‌త‌లో 50 సంవ‌త్స‌రాల‌కు పైబ‌డిన వ్య‌క్తుల‌కు టీకా అందించే స‌మ‌యంలో రాజ‌కీయ నాయ‌కులు, మంత్రులు టీకా తీసుకుంటార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  ప్ర‌ధాని మోడీకూడా అప్పుడే టీకా తీసుకుంటార‌ని ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఈ రోజు ల‌క్నోలో జాతీయ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తెలియ‌జేశారు. చూడాలి మరి ఈ రెండో విడతలో మోడీ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకుంటారు అనేది.

Related posts