telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవీకి షాక్… వర్మ పార్ట్‌నర్ ఛానెల్‌లోనే ‘పరాన్నజీవి’ విడుదల…!

Parannajeevi

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ‘పరాన్నజీవి’ పేరుతో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్‌గా ‘పవర్ స్టార్’ అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ సిద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. సుమారు 30 నిమిషాల నిడివి ఉండే ఈ సినిమాకు ‘ఎన్నికల ఫలితాల తర్వాత కథ’ అనే ఉప శీర్షిక కూడా పెట్టారు. ఈ సినిమాను జూలై 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ (ఆన్‌లైన్)లో విడుదల చేస్తున్నారు. రూ.150 చెల్లించి ఈ సినిమా చూడొచ్చు. అయితే కొంత మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు వర్మకు వ్యతిరేకంగా ‘పరాన్నజీవి’ సినిమాను తీసుకొస్తున్నారు. అది కూడా ‘పవర్ స్టార్’ విడుదలవుతోన్న జూలై 25వ తేదీనే. సరిగ్గా ఉదయం 11 గంటలకే. విచిత్రం ఏంటంటే.. వర్మతో కలిసి ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాలను నిర్మించిన శ్రేయాష్ ఈటీ సంస్థ ఈ ‘పరాన్నజీవి’ని విడుదల చేస్తుండటం విశేషం. shreyaset.com వెబ్‌సైట్‌లో ఈనెల 25న ‘పరాన్నజీవి’ విడుదలవుతుంది. నిజానికి ‘పవర్ స్టార్’ సినిమా ఈ ఛానెల్‌లో విడుదల కావాలి. కానీ, అభిమానుల హెచ్చరికతో శ్రేయాస్ ఈటీ వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఈ సినిమాను 99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందించారు. సీఎస్ నిర్మాత. ‘బిగ్ బాస్’ ఫేమ్ డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వం వహించారు. ఈయన పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి తారాగణం, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను వెల్లడిస్తామని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిలో భాగంగా ఈరోజు చిత్ర విడుదల తేదీని, ఫ్లాట్‌ఫాంలను ప్రకటించారు.

Related posts