telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జోడి ట్రైలర్… అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది ?

Jodi

సాయి‌కు‌మార్‌ తన‌యుడు ఆది సాయి కుమార్ తాజాగా విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో “జోడి” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సరసన హీరోయిన్ గా శ్ర‌ద్ధ శ్రీనాథ్ న‌టిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో ఆదిని కొత్త కోణంలో చూపించ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. ఫ‌ణి క‌ళ్యాణ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేష్ గుర్రం మ‌రియు ప‌ద్మ‌జ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, సీనియ‌ర్ న‌రేష్‌, మిర్చి మాధ‌వి, గొల్ల‌పూడి కీల‌క పాత్రలు పోషించారు. ఉగాది పండుగ సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ ట్రైలర్ లో కామెడీ, పంచ్, భావోద్వేగ సన్నివేశాల, డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఆది, శ్ర‌ద్ధాల జోడి కూడా బాగుంది. ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొంతకాలంగా ఆది సరైన హిట్ లేక యంగ్ హీరోల రేసులో వెనుకపడిపోయారు. ఈ చిత్రంతో మంచి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ఆది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts