telugu navyamedia
రాజకీయ వార్తలు

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఆఫీసుకు.. పవర్ కట్ చేస్తామని నోటీసులు!

imran pakistan pm

పాకిస్థాన్ దేశంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేదని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆఫీసుకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ నోటీసు జారీ చేసిన బాగోతం బయటపడింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ సచివాలయం ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీకి రూ.41 లక్షల విద్యుత్ బిల్లు బకాయి పడింది.

ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ ప్రధాని సచివాలయ అధికారులకు బిల్లులు చెల్లించాలని కోరుతూ ఎన్ని నోటీసులు పంపించినా వారు విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించలేదు. దీంతో విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించకుంటే పవర్ కట్ చేస్తామంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ తుది హెచ్చరిక నోటీసు జారీ చేసింది. పాక్ దేశంలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో కొరత ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తి వ్యయం కంటే ఆదాయం గణనీయంగా తగ్గింది.

Related posts