telugu navyamedia
సినిమా వార్తలు

సుడిగాలి సుధీర్ పై హైపర్ ఆది పంచ్… నేను దొరబాబు కాదంటూ ఫైర్ …

hyper-aadi

తాజాగా ఉగాది స్పెషల్ ప్రోగ్రాంలో హైపర్ ఆది ఎప్పటి లాగే సుడిగాలి సుధీర్ పై కామెంట్స్ చేస్తూ పంచ్ వేశాడు. అందులో సుధీర్ ను ఉద్దేశించి హైపర్ ఆది టెలికాస్ట్ కాని పర్సనల్ ఈవెంట్స్ పెర్ఫార్మ్ చేస్తావా అంటూ కామెంట్ చేశారు. దీనికి సుధీర్ షాక్ కు గురైనట్లు కనిపించింది. అయితే ఈవెంట్ మధ్యలోనే సుధీర్ కాస్త సీరియస్ అయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తాను హైపర్ ఆది టీమ్ మేట్ దొరబాబులా కాదని, అందరూ హైపర్ ఆది టీమ్ మెంబర్స్ లా ఉండరని సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో హైపర్ ఆది కూడా దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. అయితే తన కేరక్టర్ పై గతంలో అందరూ జోకులు వేసినప్పటికీ, గతంలో సుధీర్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ హైపర్ ఆది గతంలో దొరబాబు కేరక్టర్ పై ఇలాగే జోకులు వేశాడు. కానీ దొరబాబు నిజజీవితంలో కూడా అలాంటి వాడే అని తేలిపోయింది. అయితే ఇప్పుడు హైపర్ ఆది అలాంటి కామెంట్స్ చేయడంతో తన కేరక్టర్ ను కూడా దొరబాబుతో పోల్చినట్లు సుధీర్ ఫీలయినట్లు సమాచారం. అయితే సుధీర్ నిజానికి నిజజీవితంలో చాలా పద్ధతిగా ఉంటాడని బయట టాక్ ఉంది. 

Related posts