telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హెచ్ 1బీ వీసాపై .. ట్రంప్ ఆదేశాలు తాత్కాలిక నిలుపుదల..

indian h1b visa rejections

అమెరికా కోర్ట్ అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఊరటనిచ్చింది. హెచ్ 1బీ వీసాదారుల భార్యలకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ముగ్గురు న్యాయమూర్తుల యూఎస్ కోర్ట్సు ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్చును కోరింది. నిబధనల్ని క్షుణ్ణం గా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటి వరకు నిబంధనలు నిలుపుదల చేయటం మంచిదని అభిప్రాయం వ్యక్తంచేసింది. అలాగే తుది తీర్పును కూడా నిలిపి వేయాలని కోరింది.

హెచ్1బీ వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా, ఇది యూఎస్ కంపెనీలు విదేశీ ఉద్యోగస్తులను ప్రత్యేక వృత్తులలో నియమించుకోడానికి అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల వేలాది మంది భారత మహిళలకు ఉపశమనం లభిస్తుంది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ 2015 లో అప్పటి ఒబామా ప్రభుత్వం హెచ్ 4 వీసా విధానాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా అనేక మంది అమెరికావాసులు నష్టపోతున్నారని భావించిన ట్రంప్ సర్కారు హెచ్4 వీసా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది.

Related posts