జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో కశ్మీర్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. వాషింగ్టన్ వైట్ హౌస్ సమీపంలో కశ్మీర్‌లో మారణకాండ ఆపాలని ఆందోళన చేపట్టారు. యుద్ధం పరిష్కారం కాదని నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. మానవ హక్కులు ట్రంప్ సొంతం కాదని నినాదాలు చేశారు.
కశ్మీర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైట్‌హౌస్‌కి వంద కిలోమీటర్ దూరంలో నిరసనలు తెలిపే అవకాశం ఉందని నారాయణ అన్నారు. ఏపీ, తెలంగాణలో మాత్రం 10 కి.మీ. దూరంలో నిరసనలు తెలిపినా ఆ రెండు ప్రభుత్వాలు నేరంగా పరిగణిస్తుండటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ