telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మరో రెండు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా…

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత జట్టు ను గట్టిగా దెబ్బ తీస్తుంది ఆస్ట్రేలియా. మొదటి సెషన్ పూర్తయిన తర్వాత 161 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టు రెండో సెషన్ ప్రారంభమైన తర్వాత రెండో బంతికే మయాంక్ అగర్వాల్(38) రూపంలో మరో వికెట్ చేజార్చుకుంది. దాంతో వికెట్ కీపర్ పంత్ తో కలిసి బ్యాటింగ్ చేసేందుకు వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. అయితే దేశవాళీ క్రికెట్ లో జట్టుకు అవసరమైన సమయంలో బ్యాట్ తో రాణించిన సుందర్ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. మయాంక్ ఔట్ అయిన కాసేపటికే ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు. మరో బ్యాట్సమెన్ రిషబ్ పంత్ 23 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది టీం ఇండియా. మయాంక్ కు ఔట్ చేసిన జోష్ హాజిల్‌వుడ్ పంత్ ను కూడా వెనక్కి పంపాడు. అయితే పంత్ ఔట్ కావడంతో బేటింగ్ చేయడానికి శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే దేశవాళీ క్రికెట్ లో శార్దుల్ కు బ్యాటింగ్ లో మంచి రికార్డు ఉంది. కానీ ఇప్పుడు ఆసీస్ తో మ్యాచ్ లో అతను రాణిస్తాడా.. లేదా అనేది. ఇప్పటికి ఆసీస్ కంటే 183 పరుగులు వెనుకబడి ఉంది భారత జట్టు.

Related posts