telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్మా స్వరాజ్ నిలిచిపోతారు..

kishanreddy on ap capital

తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో సుస్మా స్వరాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్ష నేతగా, కేంద్రమంత్రిగా సుష్మాస్వరాజ్ సమవర్ధవంతంగా పనిచేశారని.. తెలంగాణ ఏర్పాటులో సుస్మాస్వరాజ్ ది కీలకపాత్ర అని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన ఘనత సుస్మాస్వరాజ్ కే దక్కుతుందని.. ఉస్మానియా విద్యార్థులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికాన్ని లేవనెత్తి విద్యార్థులకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లుకు అనుకూలంగా మాట్లాడింది సుస్మాస్వరాజు అని పేర్కొన్నారు. కాంగ్రెస్- టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలని చూసినా..‌ బిల్లు పాస్ అవడానికి కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోతారని.. తెలంగాణ ప్రజలకు, గల్ఫ్ లో బాధలు పడ్డ ఎంతోమందికి సుష్మాస్వరాజ్ సహకారం అందించారని తెలిపారు.

Related posts