telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్‌​ నటుడు అజాజ్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు

బాలీవుడ్‌​ నటుడు అజాజ్‌ ఖాన్‌కు బాంద్రా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయలు పూచీకత్తుగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన ఆరోపణలతో సైబర్‌ పోలీసులు ఏప్రిల్‌ 18న అజాజ్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇంటరాక్షన్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అతడు మాట్లాడినట్టు ముంబై పోలీసులు ఆరోపించారు. అజాజ్‌ ఖాన్‌ గతంలో కూడా అనేక పర్యాయాలు అరెస్టయ్యాడు. 2016లో ఓ బ్యూటీషియన్‌ను లైంగికంగా వేధించిన కేసులో, 2018లో డ్రగ్స్‌ కేసులో అతడు కటకటాల పాలయ్యాడు. హిందీ బిగ్‌బాస్‌ 7 సీజన్‌లో పాల్గొన్న అజాజ్‌ ఖాన్‌.. పలు బాలీవుడ్‌ సినిమాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించాడు.

Related posts